Friday, 28 October 2016

10th jobs in govt details in telugu

                                        10th jobs in govt  details



పదో తరగతి పూర్తి చేయడమనేది విద్యార్థి దశలో ఓ ముఖ్యమైన ఘట్టం. టెన్త్ తర్వాత పై చదువులు పూర్తి చేయడానికి ఆర్థిక స్తోమత లేదా ఆసక్తి లేనివారు పదో తరగతి అర్హతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొన్ని రకాల ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశముంది.
ఇరవై ఏళ్లు కూడా నిండకుండానే ప్రభుత్వంలోని ముఖ్యమైన విభాగాల్లో మంచి జీతంతో ఉద్యోగం పొందడం వల్ల భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. స్థిరమైన జీవితం ఏర్పరుచుకోవడానికి చిన్న వయసులోనే తొలి అడుగులు వేయవచ్చు.
పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగావకాశాలను అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల్లో ఏర్పడే క్లరికల్, ఆఫీసర్ తదితర హోదా పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటోంది. టెన్త్, ఇంటర్, ఆపై అర్హతలకు తగినవిధంగా నియామక ప్రకటనలు జారీ చేస్తోంది. అదేవిధంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, రైల్వే మొదలైన విభాగాలు వివిధ రకాల పోస్టుల భర్తీకి ప్రకటనలు ఇస్తున్నాయి.
రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే, అటవీ శాఖలో ఏర్పడే ఖాళీలను ఆ శాఖ భర్తీ చేస్తోంది. వీటి గురించి తెలుసుకుందాం.




 కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ - సీపీవో (భద్రతా విభాగాలు)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేస్తుంది.
సీపీవో పరిధిలోని ప్రధాన విభాగాలు:
1) బీఎస్ఎఫ్ - బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
2) సీఐఎస్ఎఫ్ - సెంట్రల్ ఇండస్ట్రియల్‌సెక్యూరిటీ ఫోర్స్
3) సీఆర్‌పీఎఫ్ - సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
4) ఎస్ఎస్‌బీ - సశస్త్ర సీమబల్
5) ఐటీబీపీఎఫ్ - ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్

అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత ఉండాలి. వయసు 18 నుంచి 23 సంవత్సరాలు ఉండాలి. పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. పురుష అభ్యర్థుల ఛాతీ చుట్టుకొలత సాధారణ స్థితిలో 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: మూడు దశలుగా జరుగుతుంది.
మొదటి దశ: శారీరక సామర్థ్య పరీక్ష. దీన్లో పరుగు పందెం నిర్వహిస్తారు. తర్వాత లాంగ్‌జంప్, హైజంప్ ఉంటాయి.
రెండో దశ: ఇది రాత పరీక్షకు సంబంధించింది. మొదటి దశ పరీక్షల్లో అర్హులైన వారికి ఆబ్జెక్టివ్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్/ హిందీ సబ్జెక్టులపై ప్రశ్నలు ఇస్తారు.
మూడో దశ: మొదటి రెండు దశల్లో జరిగిన పరీక్షల్లో విజయం సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు..


ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తరచూ ప్రకటనలు జారీ చేస్తుంది. ఈ పోస్టుల్లో కానిస్టేబుల్ హోదాలోనే కుక్, వాషన్‌మన్, బార్బర్, వాటర్ క్యారియర్, సఫాయి కర్మచారి తదితర హోదాలుంటాయి.
అర్హతలు: వీటికి కేవలం పురుషులు మాత్రమే అర్హులు.
పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: శారీరక సామర్థ్య, రాత, వైద్య పరీక్షలు ఉంటాయి.






రైల్వేలో రక్షణ విభాగానికి చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్‌లో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తుంటారు. ఈ ప్రక్రియను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ పర్యవేక్షిస్తుంది. ఈ పోస్టులకు స్త్రీ. పురుషులిద్దరూ దరఖాస్తు చేయవచ్చు.
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆబ్జెక్టివ్ తరహాలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో అరిథ్‌మెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషలతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ భాషలో కూడా ఉంటుంది. దీన్లో అర్హత సాధించిన వారికి తర్వాత శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు.
వెబ్‌సైట్‌లు: www.indianrailways.gov.in & www.scrailway.gov.in

most diploma jobs in governament details

పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఉండే అవకాశాలను ప్రధానంగా రెండు విధాలుగా విభజించవచ్చు. అవి: ఉద్యోగం, ఉన్నత విద్య.
ఉద్యోగం:
ఇందులోనూ రెండు మార్గాలున్నాయి. ఒకటి స్వయం ఉపాధి; రెండోది ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థల్లో ఉద్యోగం పొందడం. ప్రైవేటు వ్యాపార సంస్థలు, కంపెనీలు, పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలున్నాయి. విదేశాల్లోనూ ఎన్నో అవకాశాలున్నాయి.
బ్రాంచిల ఆధారంగా ఉద్యోగావకాశాలున్న రంగాలు: ఇంజినీరింగ్ డిప్లొమా (పాలిటెక్నిక్) కోర్సుల్లో వేటికి ఏ రంగంలో ఉద్యోగావకాశాలు ఉంటాయో పేర్కొంటూ సాంకేతిక విద్యాశాఖ అధికారులు రూపొందించిన జాబితా కింది విధంగా ఉంది.
1. సివిల్ ఇంజినీరింగ్: నీటిపారుదల, పబ్లిక్ హెల్త్, రోడ్లు, భవనాలు, రైల్వే, సర్వే, డ్రాయింగ్, నీటిసరఫరా, తదితర ప్రభుత్వ/ ప్రైవేటు రంగాలు.
2. ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్: డిజైన్, డ్రాయింగ్ శాఖలు, మునిసిపాలిటీల్లో లైసెన్స్ డిజైనర్, డ్రాఫ్ట్స్‌మెన్.
3. మెకానికల్ ఇంజినీరింగ్: మెషినరీ, ట్రాన్స్‌పోర్ట్, ప్రొడక్షన్ యూనిట్లలో వర్క్‌షాపులు, గ్యారేజీల్లో అవకాశాలు.
4. ఆటోమొబైల్ ఇంజినీరింగ్: ఏపీఎస్ఆర్టీసీ, రవాణా రంగం, ఆటోమొబైల్ షోరూమ్‌లు, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ.
5. ప్యాకేజింగ్ టెక్నాలజీ: ఫార్మాస్యూటికల్, ఫుడ్, బెవరేజ్, పేపర్, ప్లాస్టిక్ తదితర రంగాల్లో ప్యాకేజింగ్ విభాగాల్లో అవకాశాలు.
6. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: ఏపీజెన్‌కో, ఏపీట్రాన్స్‌కో, డీసీఎల్ లాంటి సంస్థల్లో ఉపాధి.
7. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: ఆలిండియా రేడియో, దూరదర్శన్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో అవకాశాలు.
8. అప్త్లెడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్: ప్రాసెస్, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో.
9. కంప్యూటర్ ఇంజినీరింగ్: కంప్యూటర్ మెయిన్‌టెనెన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ ట్రెయినింగ్ తదితర రంగాల్లో.
10. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: అన్ని సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీల్లో.
11. మైనింగ్ ఇంజినీరింగ్: గనులు, ఎస్.సి.సి.ఎల్., ఎన్.ఎం.డి.సి., తదితర సంస్థల్లో.
12. కెమికల్ ఇంజినీరింగ్ (సుగర్ టెక్నాలజీ): పేపర్, సుగర్, పెట్రో కెమికల్, ప్లాస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో.
13. ప్రింటింగ్ టెక్నాలజీ: కంపోజింగ్ డీటీపీ, ఫిల్మ్ మేకింగ్, ప్రింటింగ్ రంగాల్లో.
14. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్: ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో స్టెనో, టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్; రీటైల్ వ్యాపార రంగంలో అవకాశాలు. (1 నుంచి 14 కోర్సులకు కాలవ్యవధి మూడేళ్లు.)
15. ఎలక్ట్రానిక్స్‌లో స్పెషల్ డిప్లొమా కోర్సులు:
ఎంబెడెడ్ సిస్టమ్స్: ఎలక్ట్రానిక్ ఐసీ సర్క్యూట్ల తయారీ రంగం.
కంప్యూటర్ ఇంజినీరింగ్: కంప్యూటర్ మెయిన్‌టెనెన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ శిక్షణ సంస్థల్లో.
కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: ప్రాసెస్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు.
ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్: ఎలక్ట్రానిక్ ఐసీ సర్క్యూట్స్ తయారీ రంగం, ప్రాసెస్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు.
టీవీ అండ్ సౌండ్ ఇంజినీరింగ్: ఆలిండియా రేడియో, దూరదర్శన్, ప్రైవేటు టీవీ ఛానెళ్లు, ప్రభుత్వ-కార్పొరేట్ హాస్పిటళ్లలో.
బయోమెడికల్ ఇంజినీరింగ్: మెడికల్ రిసెర్చ్ సంస్థలు, హాస్పిటళ్లు.
16. మెటలర్జికల్ ఇంజినీరింగ్: ఫౌండ్రీలు, స్టీల్ ప్లాంట్స్, ఫోర్జ్ షాప్స్, రోలింగ్ మిల్లులు, హీట్ ట్రీట్‌మెంట్ షాప్స్, డిఫెన్స్ సంస్థల్లో...
17. టెక్స్‌టైల్ టెక్నాలజీ: టెక్స్‌టైల్ మిల్లులు, వస్త్రాల ఎగుమతి పరిశ్రమల్లో.
18. కెమికల్ ఇంజినీరింగ్: కెమికల్, రిఫైనరీ, పెట్రోకెమికల్ పరిశ్రమలు.
19. కెమికల్ ఇంజినీరింగ్ (ఆయిల్ టెక్నాలజీ): రిఫైనరీ, పేపర్, సుగర్, పెట్రోకెమికల్, ప్లాస్టిక్స్, ఫుడ్ ప్రాసెస్ పరిశ్రమలు.
20. కెమికల్ ఇంజినీరింగ్ (పెట్రో కెమికల్): రిఫైనరీ, పెట్రో కెమికల్, కెమికల్ పరిశ్రమలు.
21. కెమికల్ ఇంజినీరింగ్ (ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్): కెమికల్ పాలిమర్, ప్లాస్టిక్ పరిశ్రమలు.
22. సిరామిక్ టెక్నాలజీ: రిఫ్రాక్టరీ, ఇటుకబట్టీలు, సిమెంట్, గ్లాస్, సిరామిక్, శానిటరీ వేర్ తదితర రంగాలు.
23. లెదర్ టెక్నాలజీ: ట్యానరీ, ఫుట్‌వేర్ పరిశ్రమలు.
24. ఫుట్‌వేర్ టెక్నాలజీ (లెదర్): ఫుట్‌వేర్ మాన్యుఫాక్చరింగ్ అండ్ లెదర్ టెక్నాలజీ.
(15 - 24 వరకు ఉన్న కోర్సులకు కాలవ్యవధి మూడేళ్లు.)

forest jobs details in telugu

                     forest jobs details in telugu



ప్రభుత్వ అటవీ శాఖ జిల్లాల వారీగా కింది ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది.
1) అసిస్టెంట్ బీట్ అధికారులు
2) బంగ్లా వాచర్
3) ఠాగేదారు

ఈ మూడింటికి కనీస అర్హత పదో తరగతి.
వయసు: ఈ పోస్టులకు అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎత్తు: పురుషులు 163 సెం.మీ., స్త్రీలు 150 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: అర్హులైన వారికి మొదట శారీరక కొలతల పరీక్షలు ఉంటాయి. వీటిలో అర్హత సాధిస్తే రాత పరీక్ష ఉంటుంది.
రాత పరీక్ష విధానం:
1) వ్యాస రచన (జనరల్ ఎస్సే 20 మార్కులకు. సమయం: గంట)
2) జనరల్ నాలెడ్జ్ (100 మార్కులకు సమయం: గంటన్నర)
3) మ్యాథమేటిక్స్ (100 మార్కులకు సమయం: గంటన్నర) సబ్జెక్టులపై పరీక్ష.
రాత పరీక్షలో అర్హులైన వారికి నడక పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో నాలుగు గంటల లోపల పురుషులు 25 కిలోమీటర్ల దూరాన్ని, మహిళలు 16 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిచేయాలి. అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఖాళీల ఆధారంగా ప్రకటనలు వస్తుంటాయి.
వెబ్‌సైట్‌లు: forest.ap.nic.in, forests.telangana.gov.in

GROUP1 syllabus in telugu

                 GROUP1 syllabus in telugu 

 

              టీఎస్‌పీఎస్సీ > సిలబస్‌ > గ్రూప్ - 1

గ్రూప్ - 1 సిలబస్, పరీక్ష విధానం

¤ గ్రూప్ - 1 సర్వీసులు
పరీక్ష విధానం
సబ్జెక్టు సమయం (గంటలు) గరిష్ఠ మార్కులు
ప్రాథమిక పరీక్ష (ప్రిలిమినరీ టెస్ట్)
జనరల్‌స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ
(ఆబ్జెక్టివ్ టైప్) 150 ప్రశ్నలు
2 1/2 150
ఎ. రాత పరీక్ష మెయిన్స్    
జనరల్ ఇంగ్లిష్ (అర్హత పరీక్ష) 3 150
పేపర్ - 1 జనరల్ ఎస్సే
ఇందులో ఉండే అంశాలు
1. సమకాలీన సామాజిక అంశాలు, సామాజిక సమస్యలు
2. ఆర్థిక వృద్ధి, న్యాయపరమైన అంశాలు
3. భారత రాజకీయ పరిణామాలు
4. భారతదేశ చారిత్రక, వారసత్వ సంస్కృతి
5. శాస్త్ర, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు
6. విద్య, మానవ వనరుల అభివృద్ధి
3 150
పేపర్ - 2 చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం
1. భారతదేశ చరిత్ర, సంస్కృతి (ఆధునిక యుగానికి (1757 నుంచి 1947) ప్రత్యేక ప్రాధాన్యత)
2. తెలంగాణ చరిత్ర - సాంస్కృతిక వారసత్వం
3. భారతదేశ, తెలంగాణ భూగోళశాస్త్రం
3 150
పేపర్ - 3 భారతీయ సమాజం, రాజ్యాంగం, పరిపాలన
1. భారతీయ సమాజం, నిర్మితి, సమస్యలు, సామాజిక ఉద్యమాలు
2. భారత రాజ్యాంగం
3. పరిపాలన (గవర్నెన్స్)
3 150
పేపర్ - 4 ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
1. భారత ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి
2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
3. అభివృద్ధి, పర్యావరణ సమస్యలు
3 150
పేపర్ - 5 సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్
1. శాస్త్ర, సాంకేతిక రంగ పాత్ర, ప్రభావం
2. విజ్ఞానశాస్త్ర అనువర్తనలో ఆధునిక ధోరణులు
3. డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్
3 150
పేపర్ - 6 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు
1. తెలంగాణ భావన (1948 - 1970)
2. సమీకరణ దశ (1971 - 1990)
3. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా (1991 - 2014)
3 150
మొత్తం మార్కులు   900
బి. ఇంటర్వ్యూ   100
పరీక్ష మొత్తం మార్కులు   1000

సిలబస్ (ఆనర్స్ డిగ్రీస్థాయి)
పేపర్ - 1 (జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్)
(ప్రిలిమినరీ పరీక్ష)
1. కరెంట్అఫైర్స్ - ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు.
2. అంతర్జాతీయ సంబంధాలు - సంఘటనలు
3. జనరల్ సైన్స్ - సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన విజయాలు
4. ప్రకృతి సమస్యలు, విపత్తు నిర్వహణ - నిరోధం, తగ్గించే ఉపాయాలు/ పథకాలు.
5. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సామాజిక అభివృద్ధి
6. ప్రపంచ భూగోళశాస్త్రం; భారత, తెలంగాణ భూగోళశాస్త్రం
7. భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం
8. భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ
9. భారత పరిపాలన, ప్రజా/ ప్రభుత్వ పథకాలు/ విధానాలు
10. తెలంగాణ రాష్ట్ర పథకాలు
11. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
12. సమాజ బహిష్కరణలు, హక్కుల సమస్యలు (లింగ భేదం, కులం, తెగలు, అంగవైకల్యం).
13. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్
మెయిన్స్: రాతపరీక్ష
జనరల్ ఇంగ్లిష్ (అర్హత పరీక్ష)
(10వ తరగతి స్థాయి, ఇంటర్వ్యూకు అర్హత)
1. Spotting Errors - Spelling; Punctuation
2. Fill in the blanks - Prepositions; Conjunctions; Verb tenses
3. Re-writing sentences - Active and Passive voice; Direct & Reported Speech; Usage of Vocabulary
4. Jumbled sentences
5. Comprehension
6. Precis Writing
7. Expansion
8. Letter Writing
పేపర్ - 1: జనరల్ ఎస్సే
(అభ్యర్థులు ప్రతి సెక్షన్ నుంచి తప్పనిసరిగా ఒకటి చొప్పున మూడు ఎస్సేలు రాయాలి. ఒక్కో ఎస్సేకు 50 మార్కులు)
సెక్షన్ - 1
    1. సామాజిక సమస్యలు, వివాదాలు
    2. ఆర్థిక అభివృద్ధి, సవాళ్లు, న్యాయం
సెక్షన్ - 2
    3. భారత రాజకీయ వ్యవస్థ
    4. భారతదేశ చారిత్రక, సాంస్కృతిక వారసత్వం
సెక్షన్ - 3
    5. సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి
    6. విద్య, మానవ వనరుల అభివృద్ధి
పేపర్ - 2: చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ
I భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆధునిక యుగానికి (క్రీ.శ. 1757 - 1947 వరకు) ప్రత్యేక ప్రాధాన్యత:
1. తొలి భారతీయ నాగరికతలు - సింధు, వైదిక; క్రీ.పూ. 6వ శతాబ్దంలో మత ఉద్యమాల ఆవిర్భావం - జైనిజం, బౌద్ధిజం; ఇండో-గ్రీకు కళలు, వాస్తురీతి - గాంధార, మధుర, అమరావతి రీతులు; మౌర్యులు, శాతవాహనులు, గుప్తుల పాలనలో సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు.
2. ఇస్లాం రాక - భారతీయ సమాజంపై దాని ప్రభావం; భక్తి, సూఫీ ఉద్యమాల స్వభావం, ప్రాధాన్యత; కాకతీయులు, విజయనగర పాలకుల కాలంలో భాష, సాహిత్యం, కళలు, వాస్తురీతి అభివృద్ధి; ఢిల్లీ సుల్తానులు, మొఘలుల కాలంలో భాష, సాహిత్యం, కళలు, వాస్తు శిల్పం, సృజనాత్మక కళలు, స్మారక కట్టడాలు; దక్కను, భారతదేశంలో మిశ్రమ సంస్కృతి ఆవిర్భావం.
3. భారతదేశంలో బ్రిటిష్ పాలన రాజ్యస్థాపన; కర్ణాటక యుద్ధాలు, ప్లాసీ యుద్ధం, ఆంగ్లో-మైసూరు, ఆంగ్లో-మరాఠా, ఆంగ్లో-సిక్కు యుద్ధాలు, విధానాలు; వ్యవసాయ వ్యాపారీకరణ, భూమిలేని వ్యవసాయ కార్మికుల ఆవిర్భావం, దుర్భిక్షాలు - పేదరికం, డీ-ఇండస్ట్రియలైజేషన్, సంప్రదాయ కళల పతనం, సంపద తరలింపు, వర్తక-వాణిజ్యాల వృద్ధి; భారతదేశ ఆర్థిక రూపాంతరం - రైలు రోడ్లు, రవాణా, కమ్యూనికేషన్ నెట్‌వర్క్; టెలిగ్రాఫ్, పోస్టల్ సేవలు.
4. బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలు: 19వ శతాబ్దంలో గిరిజన, రైతు తిరుగుబాట్లు - 1857 తిరుగుబాటు కారణాలు, పర్యవసానాలు భారత జాతీయత ఆవిర్భావానికి దోహదపడ్డ కారకాలు, సామాజిక - మత - కుల వ్యతిరేక ఉద్యమాల ఆవిర్భావం, పెరుగుదల; బ్రహ్మసమాజం, ఆర్యసమాజం, అలీగఢ్ ఉద్యమం, సత్యశోధక్ సమాజం, జ్యోతిబా - సావిత్రిబాయి పూలే, పండిత రాంబాయి, నారాయణ గురు, అయ్యంకాళి, అనీబిసెంట్, బ్రాహ్మణ వ్యతిరేక, జస్టిస్, ఆత్మగౌరవ ఉద్యమాలు; పెరియార్, మహాత్మాగాంధీ, అంబేడ్కర్, ఇతరులు.
5. భారత స్వాతంత్రోద్యమ మూడు దశలు, 1885 - 1947, ఆలిండియా కిసాన్ సభ, కార్మిక, గిరిజన ఉద్యమాలు ఆవిర్భావం, ఎదుగుదల, స్త్రీ పురుష సమస్య మరియు మహిళా ఉద్యమం, సామ్యవాద, కమ్యూనిస్టు ఉద్యమాల ఎదుగుదల, మతతత్వం పెరుగుదల, స్వాతంత్య్రం, భారతదేశ విభజన.
II. తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం:
1. ప్రాచీన తెలంగాణ చరిత్ర, సంస్కృతి - శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, జైన, బౌద్ధమతాల ఆవిర్భావం, వ్యాప్తి, సామాజిక - సాంస్కృతిక పరిస్థితులు - భాష, సాహిత్యం, కళలు, వాస్తురీతి.
2. మధ్యయుగాల తెలంగాణ, మిశ్రమ సంస్కృతి - కాకతీయ, వెలమ సామ్రాజ్యాలు; సామాజిక-సాంస్కృతిక అభివృద్ధి, సాహిత్యం, సంగీతం, నృత్యం, కళలు, వాస్తుశిల్పాల పోషణ; కుతుబ్‌షాహీలు, తెలుగు సాహిత్యం కళలు, వాస్తుశిల్పాల పోషణ; కాకతీయులు, కుతుబ్‌షాహీలకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు - సమ్మక్క, సారక్క, సర్వాయి పాపన్న.
3. ఆసఫ్ జాహీ వంశస్థాపన - సాలార్‌జంగ్ సంస్కరణలు, తెలంగాణ ఆధునికీకరణ, నిజాం రాజుల పాలనలో సామాజిక - ఆర్థిక అభివృద్ధి - భూ విధానాలు, సామాజిక వ్యవస్థ, జాగీర్దారులు, దేశ్‌ముఖ్‌లు మొదలైన, వెట్టి - బ్రిటిష్ సార్వభౌమాధికారం, విద్యాసంస్థల స్థాపన - ఆసఫ్‌జాహీ యుగం నాటికి స్మారక నిర్మాణాలు.
4. తెలంగాణలో సామాజిక - సాంస్కృతిక చైతన్యం - ఆంధ్ర సారస్వత పరిషత్ - సాహిత్య, గ్రంథాలయ ఉద్యమాలు, నిజాం రాష్ట్ర ఆంధ్ర జనసంఘం ఏర్పాటు - ఆంధ్ర మహాసభ - సాంఘిక సంస్కరణ ఉద్యమాలు - బ్రహ్మసమాజం, ఆర్య సమాజం, ఆది-హిందు, దళిత ఉద్యమాలు, భాగ్యరెడ్డివర్మ పాత్ర - ఆంధ్ర మహిళా సభ, మహిళా ఉద్యమాల వ్యాప్తి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పాత్ర, వందేమాతర ఉద్యమం.
5. నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు - ఆదివాసీ తిరుగుబాట్లు- రాంజీ గోండు, కొమురం భీమ్ - తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం - ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టుల పాత్ర - మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లీమీన్ పార్టీ(ఎంఐఎం)/ రజాకార్లు, కాశీం రజ్వీ - పోలీసు చర్య, నిజాం పాలన ముగింపు - భారత యూనియన్‌లో హైదరాబాద్ రాజ్య విలీనం.
III. భారతదేశ మరియు తెలంగాణ జాగ్రఫీ:
1. భారతదేశం - భౌతిక నిర్మాణం, ఫిజియోగ్రఫీ, నదీ వ్యవస్థ, వాతావరణం - రుతుపవనాలు, ఎల్‌నినో, నానినో ప్రభావం, వర్షపాతంలో మార్పులు - వరదలు, కరవులు, నేలలు, అడవులు, వన్యప్రాణులు - క్షీణత, సంరక్షణ చర్యలు, ప్రధాన ఖనిజ వనరులు ఇంధన వనరులు - విస్తరణ, సంరక్షణ, ఇంధన సంక్షోభం - సాంప్రదాయేతర శక్తి వనరుల పాత్ర, సముద్ర వనరులు- ఆర్థిక ప్రాధాన్యత, ఈఈజెడ్ (ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్స్), జల వనరులు - లభ్యత, అంతర్ రాష్ట్ర పంపిణీ సమస్యలు, సంరక్షణ చర్యలు.
2. వ్యవసాయం, సాగునీటి పారుదల - ప్రధాన ఆహార, ఆహారేతర పంటలు, వ్యవసాయ శీతోష్ణ ప్రాంతాలు, హరిత విప్లవం, వ్యవసాయంలో ఇటీవలి ధోరణులు, ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు, కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్, పరిశ్రమలు - భారీ పరిశ్రమలు -ఇనుము, ఉక్కు కాటన్ టెక్స్‌టైల్, సిమెంట్, చక్కెర, ఆటోమొబైల్, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, స్థానికీకరణ కారకాలు, పారిశ్రామిక కారిడార్లు, ఆర్థికాభివృద్ధి, రవాణా: రవాణా మార్గాలు, ఆర్థికాభివృద్ధిలో రోడ్డు, రైల్ నెట్‌వర్క్ పాత్ర, హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలు, ప్రధాన ఓడ రేవులు - భారతదేశ వర్తక ధోరణులు, దిశలో వస్తున్న మార్పులు- డబ్ల్యూటీఒ పాత్ర, హిందూ మహాసముద్రంలో భారతదేశ వ్యూహాత్మక ప్రదేశం, జనాభా లక్షణాలు, జనాభా సానుకూలత మరియు సంక్రమణ, మానవాభివృద్ధి సూచీ, జనాభా సమస్యలు, విధానాలు, పట్టణీకరణ ప్రక్రియ - స్థానిక స్వభావం, మెగాసిటీల పెరుగుదల, పట్టణ వృద్ధి సమస్యలు మరియు విధానాలు, పట్టణీకరణ ప్రక్రియ - స్థానిక స్వభావం, మెగాసిటీల పెరుగుదల, పట్టణ వృద్ధి సమస్యలు, విధానాలు, స్మార్ట్ సిటీల భావన.
3. హైదరాబాద్ రాష్ట్ర భౌగోళిక విస్తరణ, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర భౌతిక నిర్మాణం, శీతోష్ణస్థితి, నదులు, నేలలు, అడవులు, వన్యప్రాణి వ్యాప్తి, క్షీణత, సంరక్షణ, ఖనిజాలు, శక్తి వనరులు - బొగ్గు, ఇనుము, సున్నపురాయి విస్తరణ. థర్మల్, జల విద్యుత్ ప్రాజెక్టులు - సమస్యలు, దృక్పథాలు.
4. వ్యవసాయం - వర్షాధార/ మెట్టభూమి వ్యవసాయం, కరవు పీడిత ప్రాంతాలు, ఉపశమన చర్యలు, సాగునీటి వనరులు: కాలువలు, చెరువులు, బావులు, భూగర్భ జలాలు అంతరించిపోవడం, వాటి సంరక్షణ - మిషన్ కాకతీయ, పరిశ్రమలు - సిమెంటు, చక్కెర, ఫార్మా, ఎలక్ట్రానిక్, పర్యాటక, ఐటీ, ఐటీఐఆర్, సెజ్‌లు. హస్తకళలు, కుటీర పరిశ్రమలు, వాటి సమస్యలు - రోడ్డు, రైలు నెట్‌వర్క్ వ్యాప్తి, ఆర్థికాభివృద్ధిలో వాటి పాత్ర. జనాభా - వ్యాప్తి, వృద్ధి, సాంద్రత, జనాభా కూర్పులు లక్షణాలు (స్త్రీ, పురుష నిష్పత్తి, వయసు, అక్షరాస్యత మొదలైన) గిరిజన జనాభా - వ్యాప్తి, గిరిజన ప్రాంతాల సమస్యలు, గిరిజన ప్రాంత అభివృద్ధి విధానాలు.
5. తెలంగాణ రాష్ట్రంలో పట్టణీకరణ, స్థానిక - తాత్కాలిక సమస్యలు, పట్టణ వృద్ధి, వలసలు, హైదరాబాద్ పట్టణ వృద్ధి పరిణామం, దశలు, చారిత్రక నగరం నుంచి ఆధునిక విశ్వనగరంగా మార్పు, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాధాన్యం, నగర నిర్మాణం, పరిశ్రమలు, పారిశ్రామిక ఎస్టేట్లు, పట్టణ మౌలిక వసతులు, రవాణా - ఔటర్ రింగ్ రోడ్, మెట్రో సమస్యలు, ప్లానింగ్ - జీహెచ్ఎంసీ, హుడా పాత్ర (మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ ప్లాన్ - 2013, హెచ్ఎండీఏ), పర్యాటక కేంద్రంగా, విశ్వనగరంగా హైదరాబాద్.
పేపర్ - 3: భారతీయ సమాజం, రాజ్యాంగం, పరిపాలన
I. భారతీయ సమాజం, నిర్మితి, అంశాలు, సామాజిక ఉద్యమాలు:
1. భారతీయ సమాజం: లక్షణాలు, భిన్నత్వంలో ఏకత్వం, కుటుంబం, వివాహం, బంధుత్వం, కులం, తెగ, మతం, భాష, గ్రామీణ - పట్టణ క్రమణిక, బహుళ సంస్కృతి.
2. సామాజిక ఎడబాటు (సోషల్ ఎక్స్‌క్లూజన్), బలహీనవర్గాలు: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు.
3. సామాజిక సమస్యలు: పేదరికం, నిరుద్యోగం, బాలకార్మికులు, మహిళలపై హింస, ప్రాంతీయతత్వం, మతతత్వం, లౌకికతత్వం, అవినీతి, కుల ఘర్షణలు, వ్యవసాయ కార్మికుల సమస్యలు, పట్టణీకరణ, అభివృద్ధి, స్థానచలనం, పర్యావరణ క్షీణత, సుస్థిరాభివృద్ధి, జనాభా విస్ఫోటనం, వ్యవసాయ సంక్షోభం, వలసలు.
4. (ఎ) తెలంగాణలో సామాజిక సమస్యలు: వెట్టి, జోగినీ, దేవదాసీ వ్యవస్థ. బాలికా శిశు, ఫ్లోరోసిస్, బాలకార్మికులు, వలస కార్మికులు, బాల్య వివాహాలు.
(బి) తెలంగాణలో సామాజిక ఉద్యమాలు.
5. భారతదేశం, తెలంగాణలో సామాజిక విధానాలు, కార్యక్రమాలు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులకు విధానాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు విధానాలు, పర్యావరణ విధానం, జనాభా విధానం, విద్యా విధానం, ఆరోగ్య విధానం, పేదరిక నిర్మూలన విధానాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, పిల్లలు, మైనారిటీలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమ పథకాలు.
II. భారత రాజ్యాంగం:
1. భారత రాజ్యాంగ పరిణామ క్రమం: ముసాయిదా కమిటీ పాత్ర, రాజ్యాంగతత్వం, పీఠిక, ముఖ్య లక్షణాలు, ప్రాథమిక నిర్మాణం సవరణలు.
2. ప్రాథమిక హక్కులు: స్వభావం, పరిధి, ప్రాథమిక హక్కుల విస్తరణ పరిమితులు, రాజ్యం, ఇతరులపై అమలు, రాజ్యాంగం పరిధిలో సంక్షేమ రాజ్యం, పంపిణీ న్యాయం, ఆదేశిక సూత్రాలు - రూల్ ఆఫ్ లా, ప్రాథమిక విధులు.
3. ప్రభుత్వ వ్యవస్థ: పార్లమెంటరీ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంటు అధికారాలు, విధులు, రాష్ట్ర ప్రభుత్వం, గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, శాసన వ్యవస్థ, అధికారాలు, విధులు, సభా హక్కులు.
4. భారతదేశంలో న్యాయవ్యవస్థ: సుప్రీంకోర్టు, హైకోర్టులు, అడ్మినిస్ట్రేటివ్, ట్రైబ్యునల్స్, సబార్డినేట్ జ్యుడీషియరీ, న్యాయ సమీక్ష, న్యాయ వ్యవస్థ క్రియాశీలత్వం, న్యాయ వ్యవస్థ స్వతంత్రత, న్యాయవ్యవస్థ జవాబుదారీతనం.
5. సమాఖ్య వ్యవస్థ: కేంద్ర - రాష్ట్ర సంబంధాలు - సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, సవాళ్లు, స్థానిక స్వపరిపాలన అధికారాలు పంపిణీకి 73, 74వ రాజ్యాంగ సవరణలు: పంచాయతీరాజ్, మున్సిపల్ సంస్థలు, జల వివాదాలు అంతర్‌రాష్ట్ర వివాదాల పరిష్కారం, అమల్లో సవాళ్లు.
III. పరిపాలన (గవర్నెన్స్):
1. పాలన, సుపరిపాలన: ఇ-గవర్నెన్స్ - అప్లికేషన్స్, నమూనాలు, కేంద్రస్థాయిలో పాలన - కేబినెట్ సెక్రటేరియట్, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ), కేంద్ర సచివాలయం, మంత్రులు, విభాగాలు, రాజ్యాంగ సంస్థలు - ఆర్థిక సంస్థలు, ఎన్నికల సంఘం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, జాతీయ మానవహక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ/ ఎస్టీ/ మైనారిటీలు, మహిళా కమిషన్లు, పార్లమెంటరీ కమిటీలు - అంచనాల కమిటీ, ప్రజాపద్దుల కమిటీ, ప్రభుత్వరంగ సంస్థల కమిటీ.
2. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పాలన - సచివాలయం, డైరెక్టరేట్లు, నాటి సంబంధాలు: జిల్లా పరిపాలన - కలెక్టర్ పాత్ర, గ్రామీణ, పట్టణ పాలన సంస్థలు - అధికారాలు, విధులు, సేవలు అందించే వ్యవస్థలు, సహకార సంస్థలు. రాష్ట్ర ఆర్థిక సంఘం: అధికారాలు, నిధుల పంపిణీ - సమస్యలు, సవాళ్లు; ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, వికలాంగుల సంక్షేమానికి అభివృద్ధి సంస్థలు; పరిపాలనపై నియంత్రణ- శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల నియంత్రణ.
3. పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసే కార్యక్రమాలు, ఏజెన్సీలు, సంస్థలు ప్రజలు కేంద్రంగా భాగస్వామ్య అభివృద్ధి:పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, మహిళా సాధికారత, సమ్మిళిత వృద్ధి, ఆరోగ్యం, ఆహార భద్రత, విద్యకు సంబంధించిన హక్కులు - సమస్యలు, సవాళ్లు.
4. అభివృద్ధి, అభివృద్ధి ప్రక్రియలపై సంవాదాలు: సేవల స్థితి, నిబంధనలు: రాజ్యం, మార్కెట్ పౌర సమాజం - కమ్యూనిటీ ఆధారిత సంఘాలు (సీబీఓ), ఎన్‌జీవోల భాగస్వామ్యం: స్వయం సహాయక బృందాలు (ఎన్‌హెచ్‌జీలు), చారిటీలు, స్టేక్ హోల్డర్లు, ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ), కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ.
5. పరిపాలనలో నైతికత, విలువలు: పౌరసేవల తటస్థత్వం, నిబద్ధతతో కూడిన బ్యూరోక్రసీ, రాజకీయవేత్త, ప్రభుత్వ ఉద్యోగ సంబంధాలు: సిటిజన్ చార్టర్లు, జెండర్ సెన్సిటైజేషన్, పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, పరిపాలనలో అవినీతి నివారణ - సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, లోక్‌పాల్, లోకాయుక్త, ఏసీబీ, వినిమయదారుల సంరక్షణ యంత్రాంగాలు; సమాచార హక్కు చట్టం - 2005 అమలు, ప్రభావం, పరిపాలనా సంస్కరణలు.
పేపర్ - 4: ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
I. భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి:
1. జాతీయాదాయం - భావనలు, జాతీయాదాయ లెక్కింపు - నామినల్, వాస్తవ ఆదాయం: భారత ఆర్థికవ్యవస్థ నిర్మాణం, వృద్ధి - భారత జాతీయ ఆదాయంలో రంగాలవారీ ధోరణులు.
2. పేదరికం, నిరుద్యోగం: పేదరిక భావనలు - ఆదాయ ఆధారిత పేదరికం, ఆదాయేతర పేదరిక సామర్థ్య విధానం (మానవ పేదరిక సూచీ) పేదరిక అంచనా, పేదరిక ధోరణులు: నిరుద్యోగ భావనలు, అంచనాలు, ధోరణులు.
3. ద్రవ్యం, బ్యాంకింగ్: ద్రవ్య సప్లయ్, భారతీయ బ్యాంకింగ్ స్వరూపం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు, ఆర్‌బీఐ పరపతి నియంత్రణ.
4. పబ్లిక్ ఫైనాన్స్: పన్నుల స్వరూపం, కేంద్ర, రాష్ట్ర పన్నులు: రెవెన్యూ, మూలధన అకౌంట్‌లో ప్రభుత్వ వ్యయం ప్రభుత్వ రుణం: కూర్పు - దేశీయ, విదేశీ అప్పు ద్రవ్యవిధానం, కోశ విధానం, కేంద్ర బడ్జెట్: బడ్జెట్ విశ్లేషణ.
5. భారత ఆర్థికవ్యవస్థలో ప్రణాళికలు: భారత ఆర్థికవ్యవస్థలో ప్రణాళికలు: లక్ష్యాలు, ప్రాథమ్యాలు, వ్యూహాలు, పంచవర్ష ప్రణాళికల విజయాలు: 12వ పంచవర్ష ప్రణాళిక - సమ్మిళిత వృద్ధి: నీతి ఆయోగ్: సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ; లక్షణాలు, సమస్యలు.
II. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ:
1. హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఆర్థికవ్యవస్థ (వ్యవసాయం, పరిశ్రమలు, వర్తకం): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (1956 -2014)లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ - వెనుకబాటుతనం, అల్పాభివృద్ధి: తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్వరూపం, వృద్ధి: రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ)లో రంగాల వారీ ధోరణులు, తలసరి ఆదాయం: ఆదాయ అసమానతలు, పేదరికం.
2. మానవ వనరులు: జనాభా స్వరూపం, పరివర్తన, జనాభా సానుకూలత (స్త్రీ, పురుష నిష్పత్తి, ప్రత్యుత్పత్తి రేటు, మరణాల రేటు): అక్షరాస్యత, వృత్తుల స్వరూపం.
3. భూ సంస్కరణలు: మొదటి తరం (1947 - 1970), రెండో తరం భూ సంస్కరణలు (1970 నుంచి), మధ్య దళారీ వ్యవస్థ రద్దు: జమిందారీ, జాగీర్దారీ, ఇనాందారీ కౌలు సంస్కరణలు, భూపరిమితి: షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూ పరాయికరణ, భూ సంస్కరణల ప్రభావం.
4. వ్యవసాయం, అనుబంధ రంగాలు, జీఎస్‌డీపీలో పంటలు, వాటి అనుబంధ రంగాల వాటా ధోరణులు, భూకమతల పంపిణీ, సాగునీటి వ్యవస్థలో ధోరణులు, మెట్ట వ్యవసాయ సమస్యలు, వ్యవసాయంపై ఆధారపడటం; పంటల సాగు ధోరణులు: ఉత్పాదకత ధోరణులు, వ్యవసాయ పరపతి, విస్తరణ, మార్కెటింగ్: సహకార సంఘాలు, ఉత్పత్తిదారుల కంపెనీలు (ప్రొడ్యూసర్ కంపెనీలు).
5. పరిశ్రమ, సేవల రంగాలు: పారిశ్రామికాభివృద్ధి: పారిశ్రామిక రంగ స్వరూపం, వృద్ధి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగం, ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణ: పారిశ్రామిక వసతుల కల్పన (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) - విద్యుత్: తెలంగాణ పారిశ్రామిక విధానం. సేవల రంగ స్వరూపం, వృద్ధి, పరిశ్రమలు, సేవల రంగంలో ఉద్యోగితా ధోరణులు: తెలంగాణ ఇన్‌ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) విధానం.
III. అభివృద్ధి, పర్యావరణ సమస్యలు:
1. పర్యావరణం వర్సెస్ అభివృద్ధి: పర్యావరణం నిర్వచనం, పర్యావరణవాదం, పర్యావరణ పరిరక్షణ విధానం, పర్యావరణ విధాన సాధనాలు.
2. సహజ వనరులు: అటవీ వనరులు - అడవుల వాణిజ్యీకరణ - అటవీ చట్టాలు వర్సెస్ అటవీ జాతులు (డ్వెలర్స్)/ వినిమయదారులు: జలం: ఉపరితల జలం, భూగర్భ జలం, నీటికి పెరుగుతున్న డిమాండ్ - తాగునీరు, పరిశ్రమలు, వ్యవసాయం, భూ వనరులు: భూ వినియోగంలో పోటీ - ఆహారం, దాణా, ఇంధనం, ఫైబర్, మైనింగ్, పర్యావరణం, సహజ వనరుల సుస్థిరత.
3. ఆవరణ వ్యవస్థలు, జీవ వైవిధ్యం: జీవావరణం, పర్యావరణ వ్యవస్థ: పర్యావరణ వ్యవస్థలో ఆహార గొలుసులు, పర్యావరణ వ్యవస్థ వర్గీకరణ: జీవ వైవిధ్యం సంరక్షణ, జీవవైవిధ్య రకాలు, జీవవైవిధ్యానికి ముప్పు.
4. పర్యావరణ కాలుష్యం, ఘన వ్యర్థ నిర్వహణ, ఘన, వ్యర్థాలు రకాలు, ఘన వ్యర్థాల ఉత్పత్తిని ప్రభావితం చేసే కారకాలు, ఘన వ్యర్థాలు రీసైక్లింగ్, పునర్వినియోగ ప్రభావం.
5. ప్రపంచ పర్యావరణ సమస్యలు: వాతావరణ మార్పిడి, భూతాపం, దాని ప్రభావం, సుస్థిరాభివృద్ధి.
పేపర్ - 5: సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్
I. సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర ప్రభావం:
1. సైన్స్ అండ్ టెక్నాలజీలో సంప్రదాయ, నూతన ఆవిర్భావ అంశాలు: సైన్స్ అండ్ టెక్నాలజీ విలువ జత చేర్పు (వాల్యూ ఎడిషన్), భారతదేశంలో ప్రస్తుత సైన్స్ అండ్ టెక్నాలజీ పరిణామాలు, జాతీయ అభివృద్ధి సాధనంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాముఖ్యత: పారిశ్రామిక అభివృద్ధి, పట్టణీకరణ.
2. జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ విధానం: కాలానుగుణంగా విధానంలో మార్పులు: టెక్నాలజీ మిషన్లు - ఐసీటీ: కంప్యూటర్లు ప్రాథమిక అంశాలు, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, కమ్యూనికేషన్.
3. భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమం, పారిశ్రామిక, వ్యవసాయ, ఇతర గ్రామీణ అభివృద్ధి కార్యకలాపాలకు అనువర్తనం, ఇన్‌శాట్, ఐఆర్ఎస్ వ్యవస్థలు, ఎడ్యుశాట్, చంద్రయాన్ - 1, భవిష్యత్ కార్యక్రమం.
4 భారతదేశం విద్య, వ్యవసాయం, పరిశ్రమల్లో స్పేస్ టెక్నాలజీ వినియోగం. వాతావరణ మార్పిడి, వరదలు, తుపాను, సునామీ, సహజ, మానవ కారక విపత్తుల నిర్వహణ.
5. శక్తి వనరులు: శక్తి వనరుల డిమాండ్, భారతీయ శక్తి వనరుల పరిస్థితి - జల, థర్మల్, అణు విద్యుత్, పునరుద్ధరణ (రెన్యువబుల్) వనరుల ప్రాముఖ్యత - పౌర, పవన, చిన్న/ మినీ/ సూక్ష్మ జలవిద్యుత్, బయోమాస్, వ్యర్థాల ఆధారిత, జియోథర్మల్ అండ్ ఫ్యూయల్ సెల్స్, ఇంధన భద్రత (ఎనర్జీ సెక్యూరిటీ) - సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర, జీవ ఇంధన (బయోఫ్యూయల్) సాగు, వెలికితీత.
II. శాస్త్ర విజ్ఞాన అమల్లో ఆధునిక ధోరణులు:
1. భారతదేశంలో పంటల శాస్త్రం: మొక్కల లక్షణాలు - పంట మొక్కలు, అటవీ మొక్క జాతులు, ఔషధ సుగంధ మొక్కలు, మేలు రకమైన, హానికరమైన మొక్కలు, మానవ జాతికి ఉపయోగం.
2. బయోటెక్నాలజీ (జీవ సాంకేతిక పరిజ్ఞానం) భావన, జెనెటిక్ ఇంజినీరింగ్ వినియోగం, మూలకణ పరిశోధన. వ్యవసాయంలో బయోటెక్నాలజీ (జీవ ఎరువులు, జీవ కీటకనాశనులు, జీవ ఇంధనాలు, టిష్యూ కల్చర్, క్లోనింగ్), పర్యావరణ (పర్యావరణ శుద్ధి ప్రక్రియలో బయోటెక్నాలజీ)
3. ఫుడ్ బయోటెక్నాలజీ, ఆహార భద్రత, ఆహార నాణ్యతా ప్రమాణాలు, ఆహార చట్టాలు, నిబంధనలు, సేంద్రియ సాగులో ఇటీవలి ధోరణులు, వ్యవసాయ యాంత్రీకరణ, సురక్షిత తాగునీరు - డిప్లోండేషన్, ఇతర పద్ధతులు.
4. మైక్రోబయల్ ఇన్‌ఫెక్షన్స్: బ్యాక్టీరియా, వైరల్, ప్రోటోజోవా, శిలీంద్ర వ్యాధుల పరిచయం. విభిన్న సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధులపై ప్రాథమిక పరిజ్ఞానం - డయేరియా, విరేచనాలు, కలర, క్షయ, మలేరియా, హెచ్ఐవీ లాంటి వైరస్ వ్యాధులు, ఎన్‌సెఫలైటిస్, చికున్ గున్యా, బర్డ్‌ఫ్లూ - నిరోధక చర్యలు.
5. వ్యాక్సిన్‌లు: రోగనిరోధక శక్తి (ఇమ్యునిటీ) పరిచయం, వాక్సినేషన్‌లో ప్రాథమిక భావనలు, వ్యాక్సిన్ ఉత్పత్తిలో సంప్రదాయ పద్ధతులు (డీపీటీ, రేబిస్ వ్యాక్సిన్ ఉత్పత్తి), ఆధునిక వ్యాక్సిన్ల ఉత్పత్తి (హెపటైటిస్ వ్యాక్సిన్ ఉత్పత్తి).
III. డేటా ఇంటర్‌ప్రిటేషన్, సమస్యల సాధన:
1. డేటా ఎనాలసిస్ - స్టాటిస్టికల్ డేటాపై ఎనలటికల్ ఇంటర్ ప్రిటేషన్, గ్రాఫ్‌లు, చార్టుల అధ్యయనం - బార్ గ్రాఫ్‌లు, లైన్ గ్రాఫ్‌లు, పై చార్టులు, డ్రాయింగ్ కన్‌క్లూజన్స్.
2. టేబులర్, డయగ్రామటికల్ డేటా ఆధారంగా సమస్యలు - ప్రాబబులిటీ లాజికల్ రీజనింగ్, అనలిటికల్, మెంటల్ ఎబిలిటీపై సమస్యలు.
3. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - నంబర్ సీక్వెన్సెస్, సిరీస్, సగటులు, సంఖ్యా వ్యవస్థలు, నిష్పత్తి, వాటాలు, లాభం, నష్టం.
4. కాలం, పని, వేగం - సమయం - దూరం, సాధారణ వడ్డీ, అనలిటికల్, క్రిటికల్ రీజనింగ్.
5. డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్: అభ్యర్థులకు ఒక సందర్భాన్ని ఇచ్చి, ఆ పరిస్థితుల వల్ల తలెత్తే సమస్యలను విశ్లేషించి, వాటికి తమ సొంత పరిష్కారాన్ని సూచించాల్సిందిగా కోరడం జరుగుతుంది.

group4 syllabus in telugu

                                   GROUP-4 syllabus in telugu 

 

గ్రూప్ - 4 సిలబస్, పరీక్ష విధానం

పరీక్ష విధానం
పేపర్ సబ్జెక్ట్ ప్రశ్నలు
(అబ్జెక్టివ్ విధానం)
సమయం గరిష్ఠ మార్కులు
పేపర్ - 1 జనరల్ స్టడీస్ 150 2.30 గంటలు 150
పేపర్ - 2 సెక్రటేరియల్ ఎబిలిటీస్ 150 2.30 గంటలు 150
మొత్తం మార్కులు 300

సిలబస్
పేపర్ - 1 (జనరల్ నాలెడ్జ్)
1) కరెంట్ అఫైర్స్
2) అంతర్జాతీయ సంబంధాలు - ఘటనలు
3) నిత్య జీవితంలో జనరల్ సైన్స్
4) ప్రకృతి సమస్యలు, విపత్తు నిర్వహణ
5) భారత, తెలంగాణ భూగోళశాస్త్రం, ఆర్థిక వ్యవస్థ
6) భారత రాజ్యాంగం, అవలోకనం
7) భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం
8) ఆధునిక భారతదేశ చరిత్ర, భారత జాతీయ ఉద్యమాలపై ప్రత్యేక శ్రద్ధ
9) తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం
10) తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు రచనలు
11) తెలంగాణ రాష్ట్ర విధానాలు
పేపర్ - 2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్)
1) మెంటల్ ఎబిలిటీ (వెర్బల్, నాన్ వెర్బల్)
2) లాజికల్ రీజనింగ్
3) కాంప్రహెన్షన్
4) పదాల వరుస క్రమం (ప్యాసేజ్‌ను మెరుగ్గా విశ్లేషణ చేయడం)
5) సంఖ్యా, అంకగణిత సామర్థ్యం

group3 syllabus in telugu

                                group3 syllabus in telugu

గ్రూప్ - 3 సిలబస్, పరీక్ష విధానం

పరీక్ష విధానం
పేపర్ సబ్జెక్ట్ ప్రశ్నలు
(అబ్జెక్టివ్ విధానం)
సమయం గరిష్ఠ మార్కులు
పార్ట్ - ఎ రాత పరీక్ష (అబ్జెక్టివ్ విధానం)      
పేపర్ - 1 జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ 150 2.30 గంటలు 1.50
పేటర్ - 2 చరిత్ర, రాజ్యాంగం, సమాజం
1. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
2. భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం
3. సాంఘిక నిర్మితి అంశాలు, ప్రభుత్వ విధానాలు
150 2.30 గంటలు 150
పేపర్ - 3 ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
1. భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు, సవాళ్లు
2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
3. అభివృద్ధి సమస్యలు, మార్పు
150 2.30 గంటలు 150
  మొత్తం మార్కులు     450

సిలబస్
పేపర్ - 1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్)
1) కరెంట్ ఎఫైర్స్ - ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు
2) అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
3) జనరల్ సైన్స్: సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన విజయాలు
4) పర్యావరణ సమస్యలు: విపత్తు నివారణ - నిరోధం, తగ్గించే ఉపాయాలు
5) ప్రపంచ భూగోళశాస్త్రం, భారతదేశ భూగోళశాస్త్రం, తెలంగాణ భూగోళశాస్త్రం
6) భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం
7) తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు, సాహిత్యం
8) తెలంగాణ రాష్ట్ర విధానాలు/ పథకాలు
9) సామాజిక వర్ణన (సోషల్ ఎక్స్‌క్లూజన్): హక్కుల అంశాలు, సమ్మిళిత విధానాలు.
10) లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్
11) బేసిక్ ఇంగ్లిష్ (10వ తరగతి స్థాయి)
పేపర్ - 2 (చరిత్ర, రాజ్యాంగం, సమాజం)
I. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ ఆవిర్భావం:
1) శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, ముదిగొండ, వేములవాడ చాళుక్యుల సంస్కృతి పోషణ - సాంఘిక విధానాలు - మత పరిస్థితులు, ప్రాచీన తెలంగాణలో బౌద్ధ, జైన మతాలు - భాష, సాహిత్య పెరుగుదల, కళలు, నిర్మాణాలు.
2) కాకతీయ రాజ్యస్థాపన - సామాజిక సాంస్కృతిక అంశాల్లో వారి పాత్ర - కాకతీయుల కాలంలో తెలుగు భాషాభివృద్ధి - కళలు, నిర్మాణాలు, లలిత కళలు - రాచకొండ, దేవరకొండ వెలమల కాలంలో సామాజిక, మత పరిస్థితులు - తెలుగు భాష, సాహిత్య అభివృద్ధి - కాకతీయులకు ఎదురైన ప్రధాన సంఘటనలు - సమ్మక్క, సారక్క విప్లవం - కుతుబ్‌షాహీల సామాజిక, సాంస్కృతిక పాత్ర - భాష, సాహిత్య అభివృద్ధి, కళలు, నిర్మాణాలు, పండగలు, నృత్యాలు, సంగీతం. మిశ్రమ సంస్కృతి ఆవిర్భావం.
3) అసఫ్‌జాహీ రాజ్య వంశ సామ్రాజ్యం: నిజాం - బ్రిటిష్ సంబంధాలు: సాలార్‌జంగ్ సంస్కరణలు, వాటి ప్రభావం; నిజాంల కాలంలో సామాజిక, సాంస్కృతిక మత పరిస్థితులు, విద్యా సంస్కరణలు, ఉస్మానియా యూనివర్సిటీ స్థాపన, ఉన్నత విద్య - మధ్య తరగతి ఆవిర్భావం, ఉద్యోగాభివృద్ధి.
4) తెలంగాణలో సామాజిక సాంస్కృతిక, రాజకీయ చైతన్యం: ఆర్యసమాజ్ పాత్ర - ఆంధ్ర మహాసభ - ఆంధ్ర సారస్వత పరిషత్ - సాహిత్య, గ్రంథాలయ ఉద్యమాలు - ఆది హిందూ ఉద్యమం - ఆంధ్ర మహిళా సభ, స్త్రీల ఉద్యమ ఉన్నతి - షెడ్యూల్డ్ తెగల విప్లవాలు - రాంజీ గోండు, కొమరం భీమ్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం - దానికి కారణాలు, పర్యవసానాలు.
5) భారత్ యూనియన్‌లో హైదరాబాద్ చేరిక, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు - పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ ఉద్యమం 1952 - 56. రక్షణల ఉల్లంఘన - ప్రాంతీయ అసమానతలు - తెలంగాణ గుర్తింపుని నొక్కి చెప్పడం. ప్రత్యేక తెలంగాణ కోసం 1969 - 70లో పోరాటం - జాతి వివక్షతపై ప్రధాన నిరసనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశ వరకు (1971 - 2014).
II. భారత రాజ్యాంగం, రాజకీయాలు:
1) భారత రాజ్యాంగ పరిణామ క్రమం - స్వభావం, ప్రధానాంశాలు - ప్రవేశిక లేదా పీఠిక
2) ప్రాథమిక హక్కులు - ఆదేశిక సూత్రాలు - ప్రాథమిక విధులు
3) భారత సమాఖ్య విధాన ముఖ్య లక్షణాలు - కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన అధికార విభజన
4) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు - రాష్ట్రపతి - ప్రధానమంత్రి, మంత్రిమండలి - గవర్నర్ - రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి మండలి - అధికారాలు, విధులు.
5) గ్రామీణ, పట్టణ ప్రాంత (స్థానిక, పురపాలక) పరిపాలన 73, 74వ రాజ్యాంగ సవరణలు.
6) ఎలక్షన్ వ్యవస్థ - స్వేచ్ఛ, నిజాయతీతో కూడిన ఎన్నికలు - దుష్ప్రవర్తన, ఎన్నికల సంఘం ఎన్నికల సంస్కరణలు, రాజకీయ పార్టీలు.
7) భారతదేశంలో న్యాయ వ్యవస్థ - న్యాయ వ్యవస్థ క్రియాశీలత.
8) ఎ) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనకబడిన తరగతులు, స్త్రీలు, మైనార్టీలకు ప్రత్యేక నిబంధనలు.
బి) సంక్షేమ యంత్రాంగం - షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్, షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్
9) భారత రాజ్యాంగం - నూతన సవాళ్లు
III. సమాజ నిర్మాణం, అంశాలు, ప్రభుత్వ విధానాలు/ పథకాలు:
భారతీయ సమాజ నిర్మాణం:
* భారతీయ సమాజ ముఖ్య లక్షణాలు - కులం, కుటుంబం, వివాహం, బంధుత్వం, మతం, జాతి, తెగలు, స్త్రీలు, మధ్య తరగతి - తెలంగాణ రాష్ట్ర సామాజిక - సాంస్కృతిక లక్షణాలు.
సామాజిక సమస్యలు:
* అసమానతలు, బహిష్కరణ - కుల వ్యవస్థ, మత వ్యవస్థ, ప్రాంతీయ వ్యవస్థ, స్త్రీ బలత్కారాలు, బాల కార్మికులు, మానవ అక్రమ రవాణ, వికలాంగులు, వృద్ధులు.
సామాజిక ఉద్యమాలు:
* రైతుల ఉద్యమాలు, షెడ్యూల్డ్ తెగల ఉద్యమాలు, వెనుకబడిన తరగతుల ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, ప్రకృతి ఉద్యమాలు, స్త్రీల ఉద్యమాలు, ప్రాంతీయ ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు.
తెలంగాణలో ప్రత్యేక నిర్దిష్ట సమస్యలు:
* వెట్టి, జోగిని, దేవదాసి వ్యవస్థ - బాల కార్మికులు, స్త్రీ శిశువు, ఫ్లోరోసిస్, వలసలు, రైతు, నేత కార్మికుల దుస్థితి.
సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు:
* ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, స్త్రీలు, మైనార్టీలు, కార్మిక, వికలాంగులు, పిల్లల, నిర్ణయాత్మక విధానాలు; సంక్షేమ కార్యక్రమాలు - ఉద్యోగిత, పేదరిక నిర్మూలన పథకాలు; గ్రామీణ, పట్టణ, స్త్రీల, పిల్లల సంక్షేమం, షెడ్యూల్డ్ తెగల సంక్షేమం. .
పేపర్ - 3 (ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి)
I. భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు:
1. వృద్ధి, అభివృద్ధి: వృద్ధి, అభివృద్ధి భావనలు - వృద్ధి, అభివృద్ధి సంబంధం.
2. ఆర్థిక అభివృద్ధి సూచిక కొలమానాలు: జాతీయ ఆదాయం - నిర్వచనం, జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు, నామమాత్రపు ఆదాయం, వాస్తవ ఆదాయం.
3. పేదరికం, నిరుద్యోగిత - పేదరిక భావనలు - ఆదాయ ఆధారిత పేదరికం, ఆదాయేతర పేదరికం: పేదరిక అంచనాలు; నిరుద్యోగిత - నిర్వచనం, నిరుద్యోగిత రకాలు.
4. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికా విధానం - ముఖ్య ఉద్దేశాలు, ప్రాముఖ్యతలు, వ్యూహాలు, పంచవర్ష ప్రణాళిక విజయాలు - 12వ పంచవర్ష ప్రణాళిక, సమ్మిళిత వృద్ధి అభివృద్ధి - నీతి ఆయోగ్.
II. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి:
1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ (1956 - 2014) - అణచివేత (నీరు (బచావత్ కమిటీ), ఆర్థిక సంపద (లలిత్, భార్గవ, వాంచూ కమిటీలు), ఉపాధి (జై భారత్ కమిటీ, గిర్‌గ్లాన్ కమిటీ), అభివృద్ధి పథంలో.
2. తెలంగాణలో భూ సంస్కరణలు - మధ్యవర్తుల తొలగింపు - జమీందారీ, జాగీర్‌దారీ, ఇనాందారీ వ్యవస్థలు - కౌలు సంస్కరణలు - భూమి మదింపు - షెడ్యూల్డ్ ప్రాంతాల వారికి కేటాయించిన భూమి.
3. వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు - జీఎస్‌డీపీలో వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వాటా - భూ పంపిణీ - వ్యవసాయ ఆధారం - నీటిపారుదల - నీటి పారుదల సౌకర్యాలు - బీడు భూముల సమస్యలు - వ్యవసాయ పరపతి.
4. పరిశ్రమలు, సేవారంగం - పరిశ్రమల అభివృద్ధి - పరిశ్రమల నిర్మాణం, పెరుగుదల - సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల అవస్థాపన - తెలంగాణ పారిశ్రామిక తీర్మానం - సేవారంగ అభివృద్ధి, నిర్మాణం.
III. అభివృద్ధి సమస్యలు, మార్పు:
1. అభివృద్ధి గతిశీలత - భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు - సామాజిక అసమానతలు - కులం, తెగలు, స్త్రీ పురుష, మతం, లింగ బేధాలు - వలసలు - పట్టణీకరణ.
2. అభివృద్ధి, మార్పు - భూసేకరణ పద్ధతులు - పునఃసంస్కరణలు, పునరావాసం.
3. ఆర్థిక సంస్కరణలు - పేదరికం, అసమానతల పెరుగుదల - సామాజిక అభివృద్ధి (విద్య, ఆరోగ్యం) సామాజిక మార్పు, సామాజిక భద్రత.
4. సుస్థిర అభివృద్ధి - భావనలు, అంచనా - సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు.

development plan in telugu

  • మనం జీవితంలో గొప్పవారిగా మారడానికి  మానము ఎవరినీ తెలుసుకోవలసిన అవసరం లేదు 
  • ఎందుకనగా మన దగ్గర ఉన్న శక్తి మించిన పవర్  ఈ  లోకంలో ఏది  లేదు 
  • ముందుగా మనము తెలుసుకోవలసిన ఏమిటంటే / తెలుసా 




  • ఒకటి 
  • రెండ్ 
  • మూడు  



నీవు ఏ పని చేయాలనీ అనుకుంటావో అది కాదు అన్ని అనుకోకుండా ముందుకు సాగు

వెళ్లక అ పని నీవల్ల జరుగుతుంది కానీ  వేరే వాలూ నీవల్ల కాదు అంటారు కానీ నువ్వు గ్రహించేది  ఏమిటంటే

అది నీవల్ల జరుగుతుంది అని కాకూడదని నేని భయబ్రాంతులకు గురిచేస్తుంటారు

ఆలా అని నీవు కాదు అని దిగులుచెందక  ముందుకు సాగిపోవడమే ని లక్ష్యం చేసుకోవాలి