Friday 28 October 2016

10th jobs in govt details in telugu

                                        10th jobs in govt  details



పదో తరగతి పూర్తి చేయడమనేది విద్యార్థి దశలో ఓ ముఖ్యమైన ఘట్టం. టెన్త్ తర్వాత పై చదువులు పూర్తి చేయడానికి ఆర్థిక స్తోమత లేదా ఆసక్తి లేనివారు పదో తరగతి అర్హతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొన్ని రకాల ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశముంది.
ఇరవై ఏళ్లు కూడా నిండకుండానే ప్రభుత్వంలోని ముఖ్యమైన విభాగాల్లో మంచి జీతంతో ఉద్యోగం పొందడం వల్ల భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. స్థిరమైన జీవితం ఏర్పరుచుకోవడానికి చిన్న వయసులోనే తొలి అడుగులు వేయవచ్చు.
పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగావకాశాలను అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల్లో ఏర్పడే క్లరికల్, ఆఫీసర్ తదితర హోదా పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటోంది. టెన్త్, ఇంటర్, ఆపై అర్హతలకు తగినవిధంగా నియామక ప్రకటనలు జారీ చేస్తోంది. అదేవిధంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, రైల్వే మొదలైన విభాగాలు వివిధ రకాల పోస్టుల భర్తీకి ప్రకటనలు ఇస్తున్నాయి.
రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే, అటవీ శాఖలో ఏర్పడే ఖాళీలను ఆ శాఖ భర్తీ చేస్తోంది. వీటి గురించి తెలుసుకుందాం.




 కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ - సీపీవో (భద్రతా విభాగాలు)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేస్తుంది.
సీపీవో పరిధిలోని ప్రధాన విభాగాలు:
1) బీఎస్ఎఫ్ - బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
2) సీఐఎస్ఎఫ్ - సెంట్రల్ ఇండస్ట్రియల్‌సెక్యూరిటీ ఫోర్స్
3) సీఆర్‌పీఎఫ్ - సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
4) ఎస్ఎస్‌బీ - సశస్త్ర సీమబల్
5) ఐటీబీపీఎఫ్ - ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్

అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత ఉండాలి. వయసు 18 నుంచి 23 సంవత్సరాలు ఉండాలి. పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. పురుష అభ్యర్థుల ఛాతీ చుట్టుకొలత సాధారణ స్థితిలో 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: మూడు దశలుగా జరుగుతుంది.
మొదటి దశ: శారీరక సామర్థ్య పరీక్ష. దీన్లో పరుగు పందెం నిర్వహిస్తారు. తర్వాత లాంగ్‌జంప్, హైజంప్ ఉంటాయి.
రెండో దశ: ఇది రాత పరీక్షకు సంబంధించింది. మొదటి దశ పరీక్షల్లో అర్హులైన వారికి ఆబ్జెక్టివ్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్/ హిందీ సబ్జెక్టులపై ప్రశ్నలు ఇస్తారు.
మూడో దశ: మొదటి రెండు దశల్లో జరిగిన పరీక్షల్లో విజయం సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు..


ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తరచూ ప్రకటనలు జారీ చేస్తుంది. ఈ పోస్టుల్లో కానిస్టేబుల్ హోదాలోనే కుక్, వాషన్‌మన్, బార్బర్, వాటర్ క్యారియర్, సఫాయి కర్మచారి తదితర హోదాలుంటాయి.
అర్హతలు: వీటికి కేవలం పురుషులు మాత్రమే అర్హులు.
పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: శారీరక సామర్థ్య, రాత, వైద్య పరీక్షలు ఉంటాయి.






రైల్వేలో రక్షణ విభాగానికి చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్‌లో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తుంటారు. ఈ ప్రక్రియను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ పర్యవేక్షిస్తుంది. ఈ పోస్టులకు స్త్రీ. పురుషులిద్దరూ దరఖాస్తు చేయవచ్చు.
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆబ్జెక్టివ్ తరహాలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో అరిథ్‌మెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషలతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ భాషలో కూడా ఉంటుంది. దీన్లో అర్హత సాధించిన వారికి తర్వాత శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు.
వెబ్‌సైట్‌లు: www.indianrailways.gov.in & www.scrailway.gov.in

No comments:

Post a Comment