STUDYS SKILLS STUDENTS
ఒక
పాఠశాలలోని తరగతి గదిలో చాలామంది విద్యార్థులున్నారు. వాళ్లందరికీ ఒకే
సిలబస్. పాఠాలు చెప్పే టీచర్ల బృందమూ ఒకటే. చదవడానికి వారందరికీ ఉన్న సమయమూ
ఒకటే. కానీ, వార్షిక పరీక్షల్లో అందరికీ మార్కులు ఒకేలా రాలేదు.
నలుగురైదుగురు రాష్ట్రంలోనే టాపర్లుగా నిలిచారు. మరికొందరు మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. కొందరేమో అత్తెసరు మార్కులతో బయటపడ్డారు. ఒకరిద్దరు పరీక్షల్లో తప్పారు కూడా.. ఎందుకు ఈ తేడా?
|
దీనికి
చాలా కారణాలను చెప్పవచ్చు. విద్యార్థి సామర్థ్యం, చదువుపట్ల అతడి వైఖరి,
ఇంటివద్ద చదివే వాతావరణం, తల్లిదండ్రుల తీరు.. ఇలా ఎన్నెన్నో.. కానీ,
అన్నిటికంటే ముఖ్యమైందీ, మార్కుల సాధనలో కీలకమైన పాత్ర పోషించేదీ ఒకటుంది.
అదే.. నైపుణ్యం.
|
చదివే
నైపుణ్యం, పరీక్ష బాగా రాయగల నైపుణ్యం విద్యార్థి విజయానికి బాటలు
వేస్తాయి. ఈ నైపుణ్యాలను నేర్చుకోవాలంటే అతడు కొన్ని లక్షణాలను
అలవరచుకోవాలి. మార్కుల సాధనకు అనువైన నైపుణ్యాలనే విద్యానైపుణ్యాలు
అనవచ్చు. విద్యానైపుణ్యాలను పుణికిపుచ్చుకుంటే ఆ విద్యార్థికి ఇక తిరుగు
ఉండదు. రోజంతా కష్టపడి చదవడం ఒక ఎత్త్తెతే, చదివినదాన్ని పరీక్షల్లో
ప్రదర్శించడం ఒక ఎత్తు. దీనికి కావలసింది మంచి చేతిరాత, జ్ఞాపకశక్తి,
ఆకట్టుకునేలా చక్కటి శీర్షికలతో కూడిన జవాబులు, వీటన్నిటినీ సాధించడానికి
అవసరమైన సానుకూల దృక్పథం తదితర నైపుణ్యాలు.
విద్యానైపుణ్యాలేవి?
వాటిని సాధించడం ఎలా? నైపుణ్యాల సాధనకు విద్యార్థికి ఉండవలసిన
లక్షణాలేవి? విద్యార్థి జీవితంలో ఎదురయ్యే పలు రకాల సమస్యలను ఎదుర్కోవడం
ఎలా? పరీక్షలు రాసేందుకు అవసరమైన మెళకువలేమిటి? ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నలకు
సమాధానమే ఈ 'స్టడీస్కిల్స్. నిపుణులు అందిస్తున్న ఈ సమాచారాన్ని
క్షుణ్ణంగా అధ్యయనం చేసి మీరూ విద్యానైపుణ్యాలను సాధించండి. మార్కుల
సాధనలో ముందు నిలిచి కెరీర్‌ని తీర్చిదిద్దుకొండి.
పాఠశాలలో
చేరినప్పటి నుంచే విద్యార్థికి పరీక్షలు తప్పనిసరవుతాయి. పదో తరగతి నుంచి
పరీక్షలకు పూర్తి స్థాయి శక్తియుక్తులను ఉపయోగించి చదవాల్సి ఉంటుంది.
దాదాపు 30 నుంచి 35 ఏళ్ల వయసు వరకూ ప్రభుత్వోద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధం
కావలసి ఉంటుంది. సామాన్యుల జీవితంలో అభివృద్ధి, పరువూ, ప్రతిష్ఠ పరీక్షలతో
వాటి ఫలితాలతో ముడిపడి ఉంటుంది.
పరీక్షల్లో
విజయం మన జీవిత గమనాన్ని సాఫీగా, తక్కువ ఒడిదుడుకులతో కొనసాగేలా
చేస్తుంది. మంచి మార్కులూ, ర్యాంకులూ తెచ్చుకుంటే మరింత సులువుగా, త్వరగా
మన జీవిత లక్ష్యాలను సాధించగలుగుతామనడంలో సందేహం లేదు. ప్రస్తుత
వ్యాసాల్లోని అంశాలు పదో తరగతి నుంచి సివిల్స్ వరకూ అన్ని పరీక్షలకూ
సరిపోతాయి. ఉపాధ్యాయులు, మానసిక శాస్త్ర నిపుణులూ కలిసి క్రోడీకరించిన ఈ
సూచనలను కలంద్వారా మనకు అందిస్తున్నారు.
చాలా సూచనలను విద్యార్థుల వ్యక్తిగత పరిస్థితులకు అనుగుణంగా మార్పుచేర్పులు
చేసుకొని అన్వయించుకోవాలి. ఈ సూచనలు విజయానికి దగ్గరదారులు (షార్ట్ కట్స్)
కావు. మీరు విజయం సాధించడానికి కావాల్సిన ఆలోచనాత్మక పునాదిని అందించేవి.
పట్టుదలతో, సహనంతో ఇందులోని సూచనలను ఆచరించి మీ విజయసౌధం మీరే
నిర్మించుకోవాలి. విశ్వాసంతో ముందడుగు వేయండి.
|
ఆల్ ది బెస్ట్
STUDYS SKILLS STUDENTS |
No comments:
Post a Comment